close
Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,27,774 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
జాజికాయ
Image

జాజికాయ అనేది మిరిస్టికా జాతికి చెందిన చెట్ల విత్తనం, లేదా విత్తనం నుండి పొందిన పొడ. ఇది ఒక సుగంధ ద్రవ్యం. సువాసనగల జాజికాయ అనేది ముదురు ఆకులతో కూడిన సతత హరిత వృక్షం. దీని పండ్ల నుండి రెండు సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేస్తారు. ఒకటి విత్తనం నుండి వచ్చే జాజికాయ, మరొకటి విత్తనాన్ని కప్పిఉంచే పొరనుంచి వచ్చే జాపత్రి. వాణిజ్యపరంగా ఉత్పత్తి అయ్యే జాజికాయ నూనె, వెన్నలకు కూడా ఇదే మూలం. ఇండోనేషియాలోని మలుకు ప్రావిన్స్ లోని బండా దీవులు జాజికాయ, జాపత్రి ఉత్పత్తికి ప్రధానమైనవి. ఇక్కడే నిజమైన జాజికాయ చెట్టు స్థానికంగా పెరుగుతుంది. ఆహారపు సుగంధ ద్రవ్యాలుగా సాధారణంగా ఉపయోగించే జాజికాయ, జాపత్రిలను వాటి మానసిక, కామద్దీపక ప్రభావాల కోసం సాంప్రదాయకంగా ఉపయోగిస్తారు. అయితే దీనికి వైద్యపరమైన ఆధారాలు లేవు. అధిక మోతాదులో తీసుకుంటే తీవ్రమైన సైకోసిస్‌ తో పాటు గర్భధారణ, మానసిక పరిస్థితుల సమయంలో తీవ్రమైన విష ప్రభావాలను కలిగిస్తాయి. జాజికాయ య్యూస్ అని పిలవబడే టోర్రేయా జాతికి చెందిన కోనిఫెర్‌లు కూడా ఒకే విధమైన రూపాన్ని కలిగి తినదగిన విత్తనాలను కలిగి ఉంటాయి. కానీ వీటికి జాజికాయతో దగ్గరి సంబంధం లేదు. వీటిని సుగంధ ద్రవ్యంగా ఉపయోగించరు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... కె. జి. బాలకృష్ణన్ కేరళ నుంచి వచ్చిన మొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనీ!
  • ... కర్ణాటకలోని సంకిఘట్ట జైనమతంలో ఒక చారిత్రక ప్రదేశమనీ!
  • ... రాజస్థాన్ లోని చిత్తూరు కోట భారతదేశంలో అతిపెద్ద కోటలలో ఒకటనీ!
  • ... తాజ్ హోటల్స్ ప్రపంచ ప్రముఖ హోటల్స్ జాబితా అయిన గోల్డ్ స్టాండర్డ్ హోటల్స్ లో ఉన్నాయనీ!
  • ... జామియా మిలియా ఇస్లామియా జాకీర్ హుస్సేన్, మహాత్మా గాంధీ లాంటి వారు కలిసి స్థాపించిన పరిశోధన విశ్వవిద్యాలయమనీ!
చరిత్రలో ఈ రోజు
ఆగస్టు 18:
Image
ఈ వారపు బొమ్మ

ఆత్మగౌరవ పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

376వ జయంతి వేడుకలు ఘనంగా.. గుండాలలో పాపన్న గౌడ్‌కు ఘన నివాళి!

గుండాల, ఆగస్టు 18:

తెలంగాణ విప్లవ వీరుడు, బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను గుండాల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన ధైర్యసాహసాలు, సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాటాన్ని పలువురు కొనియాడారు.

పాపన్న గౌడ్ ఆశయాలను నేటి తరానికి చేరవేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నాయకులు పేర్కొన్నారు. అణగారిన వర్గాల ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన పాపన్న గౌడ్ చరిత్రను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన పోరాట స్ఫూర్తి తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సుధగాని రామచంద్రయ్య, పొడిచెట్టి వెంకన్న, కొమ్మాయిపల్లి బాలరాజ్, ఏలికట్టి సోమయ్య, గిరకత్తుల శ్రీనివాస్, బుసిగంప పరశురాములు, అంబటి సోమయ్య, దంతూరి మల్లయ్య, ఒలంధాస్ ప్రభాకర్, చంద్రగిరి వెంకన్న, గంగాపురం ఉప సర్పంచ్ ఎలికట్టి మల్లయ్య, ఏలికట్టి చిన్న మల్లయ్య, చంద్రగిరి అంజయ్య, ఎలికట్టి ముత్తయ్య, గుండాల ఉప సర్పంచ్ ఆవుల సాయిప్రసాద్, గుండాల గ్రామ శాఖ అధ్యక్షుడు కొడపర్తి భాస్కర్, సింగిల్ విండో డైరెక్టర్ దూదిగాని నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
Image
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
Image
వికీసోర్స్ 
మూలాలు 
Image
వికీడేటా 
వికీడేటా 
Image
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
Image
విక్షనరీ 
శబ్దకోశం 
Image
వికీకోట్ 
వ్యాఖ్యలు 
Image
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.